ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి సర్కిల్ పరిధిలోని 8 డివిజన్లు, 27 సబ్-డివిజన్ కార్యాలయాల్లో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 34 సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని ఎస్ఈ సురేంద్రనాయుడు బుధవారం తెలిపారు. కరెంట్ ఫోల్లు, లైన్ల మార్పు, అధిక విద్యుత్తు బిల్లింగ్, మీటర్ల మార్పు తదితర సమస్యలను తెలియజేసినట్టు ఆయన చెప్పారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.