నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఘనంగా జరిగింది. ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించి తదనంతరం పట్టు వస్త్రాలు పూలమాలలతో అలంకరించి లోక కల్యాణార్ధం శ్రీ లక్ష్మీ నారాయణ హోమం నిర్వహించారు. అనంతరం మహిళలచే ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రూపేష్ క్రిష్ణ కుంకుమార్చన నిర్వహించి వరలక్ష్మి వ్రత కథను వినిపించారు.