జూనియర్ ఎన్టీఆర్ 41వ జన్మదిన సందర్భంగా ఆదివారం రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. పుత్తూరు పట్టణంలోని హిమజ హై స్కూల్ నందు 75 మంది స్వచ్ఛందంగా హాజరై రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.