యాదమరి– చిత్తూరు వయా దలవాయి బస్సు సర్వీసును ఎమ్మెల్యే మురళీమోహన్ ఆదివారం ప్రారంభించారు. గత ఐదు సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేక గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు తెలుసుకుని ప్రారంభానికి చర్యలు తీసుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.