ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన మారెమ్మ

55చూసినవారు
ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన మారెమ్మ
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని పాత బస్టాండు సమీపంలో ఉన్న శ్రీ విరూపాక్షి మారెమ్మ మంగళవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో మారెమ్మను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమ లను సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్