భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు

65చూసినవారు
భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు
పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండల కేంద్రంలోని శ్రీకన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు సామూహికంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరలక్ష్మి దేవిని సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. మహిళల చేత శాస్త్రోత్తకంగా వ్రతం చేయించారు. తోరం ధరించి వ్రత విశిష్టతను తెలిపే కథను సంపూర్ణంగా విన్నారు. మహా మంగళ హారతి అనంతరం అర్చక స్వాములు తీర్థప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్