చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం కల్లూరు దేవళంపేటలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి పంచామృతాభిషేకలను నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పండితులు అనంత కుమారాచార్యులు మాట్లాడుతూ శుక్రవారం స్వామివారికి ఎంతో ముఖ్యమైన రోజు అని తెలిపారు.