వ్యవసాయం సాగు పరిశీలనకు రాజస్తాన్ కు
చెందిన బృందం గురువారం పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం లోని పలు ప్రాంతాలలో పర్యటించారు. అటల్ భుజల్ యోజన కింద ఏడుగురు వ్యవసాయ రాష్ట్రస్థాయి అధికారులు మరియు రైతులతో కూడిన బృందం సరస్వతీ పురంలోని మహేశ్ కు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని తోటలో 22 రకాల మొక్కలను, పలురకాల ఫలవృక్షా లను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పలు విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.