ఒకే దేశం-ఒకే ఎన్నికపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. కేంద్రం ఈ బిల్లును తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గంలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్నట్లు అంతా భావించారు. కానీ ఇంతలోనే కేంద్రం వెనక్కి తగ్గింది. లోక్‌సభలో సోమవారం జరిగే బిజినెస్ అజెండా నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులను తొలగించింది. దీంతో ఈ బిల్లులు చట్టసభల ముందుకు రావడంపై సందిగ్ధత నెలకొంది.