వరదయ్యపాళెం: సచివాలయ భవనంప్రారంభించాలి
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలంలోని ఇందిరానగర్ పంచాయతీలో ఉన్న నూతన సచివాలయం భవనాన్ని ప్రారంభించాలని ఇందిరా నగర్ కు చెందిన గుత్తి త్యాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా గ్రామ పంచాయతీ అధికారిణి సుశీల దేవికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఇందిరా నగర్ లో ని ప్రస్తుత సచివాలయ భవనంలో సచివాలయ సిబ్బంది, సచివాలయానికి వచ్చే ప్రజలు సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని చెప్పారు.