ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సత్యవేడు నియోజకవర్గం కేవీబీ. పురం మండలం కలత్తూరు రైతులు ఈనెల తొమ్మిదో తేదీన టవర్ ఎక్కిన విషయం తెలిసిందే. అప్పుడు పోలీసులు, రెవెన్యూ అధికారులు హామీతో వారు కిందికి దిగారు. అయితే వారు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో సోమవారం మరోసారి వారు టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. హామీలు పరిష్కారం కాకపోతే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు.