రామసముద్రం మండల కార్యాలయ అధికారి ఎంపిడిఓ నారాయణ స్వామి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇన్ ఛార్జ్ ఎంపిడిఓ బానుప్రసాద్ మాట్లాడుతూ మేమిద్దరం ఒకే సారి జిల్లాకు ఎంపిడిఓగా వచ్చామని, ఆయన సేవలు ప్రశంసనీయం అని కొనియాడారు. ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఉద్యోగం పై అంకిత బావంతో పనిచేయడం జరగాలన్నారు. ఎంపిడిఓ కార్యాలయంలో పదవీ విరమణ సందర్బంగా శనివారం ఆయనను ఘనంగా సన్మానించారు.