తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఒక తిరుచ్చిలో శ్రీ మలయప్ప స్వామి, మరో తిరుచ్చిలో శ్రీకృష్ణ స్వామి వేంచేయగా పార్వేట మండపంలో పుణ్యాహవచనం, ఆరాధన, నివేదన చేసి హారతులు ఇచ్చారు. శ్రీకృష్ణస్వామివారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు తీసుకెళ్లి హారతులు ఇచ్చారు. శ్రీమలయప్పస్వామి వారు కొంత దూరం పరుగెత్తగా అర్చకులు బాణంవేసిన తర్వాత వెనక్కి వచ్చారు.