చంద్రగిరి మండలం ఏ. రంగంపేటలోని మోహన్ బాబు వర్సిటీకి మంచు మనోజ్ వస్తున్నారన్న సమాచారంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే వర్సిటీలో మోహన్ బాబు, విష్ణు ఉన్నారు. బుధవారం రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి వర్సిటీకి మనోజ్ ర్యాలీగా బయల్దేరిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.