చంద్రగిరి: విద్యుత్ షాక్ తో రెండు ఆవులు మృతి

79చూసినవారు
చంద్రగిరి: విద్యుత్ షాక్ తో రెండు ఆవులు మృతి
పాకాల మండలం ఆదెనపల్లి పంచాయతీ పులివర్తివారిపల్లిలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రెండు ఆవులు మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. రైతు ముని నాయుడుకు చెందిన ఆవులు సమీప పొలంలో మేత మేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాయి. రైతు మునినాయుడు, జయలక్ష్మి దంపతులు వీటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వమే సాయం చేసి వారిని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్