యర్రావారిపాలెం మండలంలో 30 రేషన్ షాప్ లు ఉండగా ఇందులో 19 షాప్ లకు పాకాల గోడౌన్ నుంచి రేషన్ సరఫరా జరుగుతోంది. అవి ప్రతినెలా 30 తారీకు లోపల సరఫరా అవుతున్నాయి. మిగిలిన 11 షాప్ లకు చంద్రగిరి గోడౌన్ నుంచి సరఫరా అవుతున్నదిఅవుతున్నది. ఇవి నాలుగు ఐదు తేదీలకు కూడా రేషన్ షాప్ లకు రేషన్ సరఫరా కావడంలేదు. మీకు ఎందుకు రాలేదని డీలర్లని ప్రశ్నిస్తున్నారు. గోడౌన్ నుంచి రేషన్ సమయానికి అందక డీలర్లు శుక్రవారం ఆవేదన చెందుతున్నారు.