చంద్రగిరిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తూ కోట్లు కూడగట్టుకుంటున్నారు. కొద్ది రోజులుగా రెడ్డివారిపల్లెలోని స్వర్గముఖి నదిలో జేసీబీల సాయంతో ఇసుకను తోడేసి, ఆపై టిప్పర్లు, లారీలతో తరలిస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అక్కడే ఇసుక మాఫియాకు చెందిన వ్యక్తులు మద్యం సేవించి బాటిళ్లను పగలగొడుతున్నారని, మూగజీవాలు గాయపడుతున్నట్లు రైతులు అవేదన చెందుతున్నారు.