డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 11 మంది వాహన చోదకులకు జడ్జి ఉమాదేవి రూ. 1. 10 లక్షల జరిమానా విధించినట్లు శుక్రవారం చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు తెలిపారు. ఇప్పటివరకు 50 మందికి పైగా జరిమానా విధించామన్నారు. తొలిసారి పట్టుబడితే రూ. 10 వేలు, 6 నెలలు జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ. 15 వేలు జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందన్నారు. తాగి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.