చిత్తూరు నగరంలోని సంతపేట పిఎన్సి నగర పాఠశాల క్రీడా మైదానంలో.. కూటమి ప్రభుత్వం 100 రోజుల సుపరిపాలన "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ఒక్క రాజధాని ప్రకటించి దాని రూపకల్పన చేసిన ఘనుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు.