బంగారు నగల చోరీ పై కేసు: సిఐ

60చూసినవారు
బంగారు నగల చోరీ పై కేసు: సిఐ
చిత్తూరు కట్టమంచి అభయ సాయి వీధిలో రూ. 9 లక్షలు విలువ చేసే 200 గ్రాముల బంగారు నగలు చోరీపై కేసు నమోదు చేసినట్లు ఒకటవ పట్టణ సీఐ జయరామయ్య తెలిపారు. మధుసూదన్ ప్రసాద్ ఇంట్లో సోమవారం ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు బీరువా నుండి 200 గ్రాముల బంగారు నగలు చోరీకి పాల్పడ్డారన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్