పేకాటస్థావరం పై దాడి: కానిస్టేబుల్ సహా 9 మంది అరెస్ట్

1860చూసినవారు
పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో కానిస్టేబుల్ సహా 9మంది జూదరులను అరెస్టు చేశారు. ఈ వివరాలను కార్వేటినగరం సిఐ సత్యబాబు మీడియాకు తెలియజేశారు. కార్వేటి నగరం మండలం, బట్టువారిపల్లి సమీపంలో ఓ మామిడి తోటలో జూదమాడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. జాదరుల నుంచి రూ. 5, 26, 330 , 11 సెల్ ఫోన్లు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్