చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని మండలాలలో ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని తెలిపారు.