గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం ఎక్సైజ్ ఎస్ఐగా శ్రావణ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్వేటినగరం పరిధిలో నాటు సారా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు.