ఎస్ ఆర్ పురం: సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలి

75చూసినవారు
ఎస్ ఆర్ పురం: సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలి
ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని చిత్తూరు జిల్లా డి ఎం హెచ్ ఓ ప్రభావతి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం పీహెచ్సీ ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలు, గర్భిణీలకు అందిస్తున్న వైద్యం గురించి ఆరా తీశారు. పీహెచ్ లోని అన్ని వార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్