టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం చిత్తూరు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా సభ్యత్వ నమోదులో లక్ష్యాలు చేరుకున్న వారికి మొదటి బహుమతిగా రూ. 25 వేలు, రెండో బహుమతిగా రూ. 15 వేలు, మూడో బహుమతిగా రూ. 10 వేలు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.