చిత్తూరు జిల్లా రామకుప్పంలో గోవిందప్ప కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్టు ఇన్ చార్జ్ డిఎస్పీ ప్రభాకర్ గురువారం తెలిపారు. రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేసును చేధించినట్లు చెప్పారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. కిడ్నాప్ ఉపయోగించిన మూడు కార్లను సీజ్ చేశామన్నారు.