108 సిబ్బంది సేవలకు సెల్యూట్

1082చూసినవారు
తాగడానికి నీళ్లు లేక, తినడానికి ఆహారం దొరక్క అడవిలో అలమటిస్తున్న వానర గుంపుకు 108 సిబ్బంది నీళ్లు, ఆహారం అందించి శభాష్ అనిపించుకున్నారు. నిమ్మనపల్లె 108 సిబ్బంది వాణి, సూరి తిరుపతికి పేషెంట్ ను తరలిస్తుండగా వానరగుంపు రోజూ బండికి అడొచ్చేవి. మంగళవారం వారు ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటమే కాకుండా కోతులకు సైతం భాకారపేట అడవిలో ఆహారం, నీళ్లు సరఫరా చేసి తాము సేవచేయడంలో తీసిపోమని నిరూపించారు.

సంబంధిత పోస్ట్