కుటుంబ సమస్యలతో గురువారం మహిళ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మదనపల్లి తాలూకా పోలీసులు తెలిపారు. ఈశ్వరమ్మ కాలనీకి చెందిన భూదేవి (45) తన భర్త రెండు కాళ్లు కోల్పోవడంతో కుటుంబ భారం భుజాలపై వేసుకుంది. పిల్లల పోషణతో పాటు భర్త ఆరోగ్య రక్షణ కష్టంగా మారడంతో కుటుంబ సమస్యలు అధికమయ్యాయి. జీవితంపై విరక్తి చెందిన భూదేవి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.