రామసముద్రం పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ కొండయ్య నాయుడు బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో ఎంతటి వారైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసు నమోదు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అన్ని ప్రవేశ ద్వారాలు వద్ద చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. డీఎస్పీ వెంట సర్కిల్ ఇన్ స్పెక్టర్ రమేష్, ఎస్ ఐ వెంకటసుబ్బయ్య ఉన్నారు.