నగిరి పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని పెరుమాళ్ గుడి వీధి నందు గల శ్రీ కరియ మాణిక్య స్వామి ఆలయంలో శుక్రవారం వేకువజాము నుంచే వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సందర్భంగా వైకుంఠద్వార దర్శనం ప్రారంభమైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు వైకుంఠ ద్వారం తెరచి ఉంటుందని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.