చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గంలో ఈనెల 26 నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భాను ప్రకాష్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సంక్షేమమే తమ ధ్యేయం అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ టిడిపి సభ్యత్వాన్ని తీసుకోవాలని ఆయన కోరారు.