నగిరి: మున్సిపల్ కార్మికులకు వర్కర్స్ కాలనీ ఏర్పాటు చేయాలి

59చూసినవారు
నగిరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు మున్సిపల్ పరిధిలో వర్కర్స్ కాలనీ ఏర్పాటు చేయాలని సీపీఐ పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం మున్సిపల్ కార్మికులకు ఇంటి స్థలాలు కేటాయించాలని నిరసన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదన్నారు. కార్యక్రమంలో కోదండయ్య, వేలన్, మురళి, భాష, విజయ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్