నగరి నియోజకవర్గం, వడమాలపేట మండలం, పూడి క్రాస్ రోడ్లో వెలసిన అంకాలపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా ఆలయంలోకి భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే అమ్మవారికి పంచామృతములతో అభిషేకం చేసి పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త పీతాంబరం ఆచారి కుటుంబ సభ్యులు భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఆలయ అర్చకులు జగద్గురు స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.