చిత్తూరు జిల్లా, గుడిపాల మండలం, ముత్తుకూరు పల్లె గ్రామంలో వెలసిన రామాలయంలో బుధవారం నాడు ప్రత్యేక విశేష నిర్వహించారు. స్వామివారి చిత్రపటాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు చంద్రాచ్చారి స్వామి వారికి అష్టోత్తర పూజ చేశారు. అనంతరం నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. గ్రామస్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.