నగరి నియోజకవర్గం కూనమరాజుపాళెంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శనివారం ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈక్రమంలో భక్తాంజనేయ స్వామివారిని పూలమాలలతో అలంకరించారు. హనుమాన్ ఉపాసకులు శ్రీ పుండరీక వరదానందస్వామి నాగవళ్ళి దళార్చన చేశారు. అనంతం నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతులు సమర్పించారు.