పలమనేరు సబ్ డివిజన్ పరిధిలో అనుమతులు లేకుండా ఎవరైనా జల్లికట్టు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రభాకర్ బుధవారం హెచ్చరించారు. పండగ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడి పందేలు, జూదాలు చట్టరీత్యా నేరమన్నారు.