వీ. కోట మండల కేంద్రంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సుజలా వాటర్ ప్లాంట్ ను సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం నారా భువనేశ్వరి చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు.