గంగమ్మ ఆలయం ఆధ్వర్యంలో అన్నదానం

1033చూసినవారు
గంగమ్మ ఆలయం ఆధ్వర్యంలో అన్నదానం
పీలేరు ఆర్టీసీ బస్టాండు సమీపంలో బురకాయలకోట గంగమ్మ ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేసినట్లు ఆలయ చైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని స్థానిక వారపు సంతకు వచ్చే వారి కోసం ఈ కార్యక్రమాన్ని చేశామని అన్నారు. ప్రజలు, అమ్మవారి భక్తులు అత్యంత భక్తితో ఈ అన్న ప్రసాదాలను స్వీకరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అమ్మవారి ఆలయ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్