ట్రాక్టర్ ఢీకొని యువకుని పరిస్థితి విషమించినట్లు పిటీఎం సిఐ హరిప్రసాద్ తెలిపారు. ఏనుగుదళ వారి పల్లెకు చెందిన సుదర్శన్ (20) స్కూటర్ మీద కర్ణాటక సరిహద్దుకు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఏనుగుదళ వారి పల్లి క్రాసు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ డీ కొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే మదనపల్లి ఆసుపత్రికి తరలించగా వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.