పీలేరు సమీపంలో బుధవారం రైలు పట్టాలపై మృతి చెందిన యువకులను రైల్వే పోలీసులు గుర్తించినట్లు కదిరి రైల్వే పోలీసు ఎస్సై రహీం తెలిపారు. పీలేరు పట్టణానికి చెందిన కిరణ్ కుమార్ (19), అదే పట్టణానికి చెందిన అతని స్నేహితుడు యాసీన్ (17) పులిచెర్ల రోడ్డులో రైలు పట్టాలపై కూర్చుని మద్యం సేవిస్తుండగా రైలు ఢీ కొట్టినట్లు రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రహీం అనుమానం వ్యక్తం చేశారు.