బంగారుపాళ్యం మండలం బోడబండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం రాత్రి పొన్నెపాలెంకు చెందిన కోదండ యాదవ్ పొలంలో ఏనుగులు మామిడి, వరి, కొబ్బరి అరటి, ఉలవలు, పంటలను తొక్కి నాశనం చేశాయి. ఏనుగులు నుంచి తమను, పంటలను రక్షించాలని పలుమార్లు అటవీశాఖ అధికారులకు చెప్పిన ప్రయోజనం లేదని రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతు కోదండ యాదవ్ కోరారు.