అల్పపీడనం ప్రభావంతో పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది, భక్తులు, స్థానికులు చలికి వణికిపోతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షంతో భక్తులకు ఆలయాల్లో రాకపోకలు కష్టమైనట్లు సమాచారం.