తవణంపల్లె మండలం చేరాల గ్రామానికి చెందిన దళితులు గత ప్రభుత్వంలో వివక్షతకు గురయ్యారని టీడీపీ రాష్ట్ర చీఫ్ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి అర్జీ ఇచ్చారు. టిడిపికి చెందిన వారిని గత ప్రభుత్వ నాయకులు వివక్షత చూపించారని, వారికి ఇంటి స్థలాలు, పట్టాలు అందజేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ పరిశీలించాలని ఎమ్మార్వోను ఆదేశించారు.