118 మందికి వ్యాక్సిన్ వేసిన వైద్యాధికారులు

60చూసినవారు
118 మందికి వ్యాక్సిన్ వేసిన వైద్యాధికారులు
పుంగనూరు నియోజకవర్గం సోమల పి. హెచ్. సి పరిధిలోని పలు గ్రామాలలో సోమవారం 118 మందికి బీసీజీ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి జయసింహ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. 2025 నాటికి దేశంలో క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయం అని సి హెచ్ ఓ అమర్నాథ్ తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్