చౌడేపల్లి: భూవివాదంలో ముగ్గురు మహిళలకు గాయాలు

67చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం మోట్లవారిపల్లి గ్రామ సమీపంలో భూ వివాదంలో ఇరు వర్గాలు గొడవపడ్డారు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. గాయపడ్డ మహిళలను స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. బాధితురాలు మహేశ్వరి సోమవారం రాత్రి మాట్లాడుతూ తమ పొలంలో కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి 30 మామిడి చెట్లు ధ్వంసం చేసి తమపై దాడి చేశారని అన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్