మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డి

59చూసినవారు
పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని అనంతపురం మున్సిపల్ ఆర్డి మూర్తి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ సచివాలయ సిబ్బందికి విధుల పట్ల పలు సూచనలు, సలహాలు చేశామన్నారు. అదేవిధంగా సిబ్బంది విధులకు విధిగా హాజరుకావాలని తెలియజేశారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు తప్పవని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్