పుంగనూరు మండల పరిధిలోని బోడేవారి పల్లి గ్రామంలో కాపురం ఉంటున్న దేవేంద్ర సోమవారం ఉదయం కూలి పనులు నిమిత్తం ఇంటి నుంచి వెళ్లాడు. అనంతరం గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని శవ పంచనామ నిమిత్తం మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.