పుంగనూరు రేపు జరిగే నవోదయ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎంఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పుంగనూరు పరిధిలో బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, కొత్తయిండ్లు మున్సిపల్ హైస్కూల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మూడు కేంద్రాలలో 588 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు.