పుంగనూరు పట్టణ పరిధిలో సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు వివరాలు మేరకు పట్టణ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ యూఎన్నార్ సర్కిల్ వద్ద ఉన్నటువంటి పార్థు బేకరీలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసామని అధికారి తెలిపారు. ఈ ఘటనలో ఐదు లక్షల మేర నష్టం వాటిలిందని ఫైర్ ఆఫీసర్ తెలియజేశారు.