పుంగనూరు నుంచి విజయవాడకు నూతన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును బుధవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ పుంగనూరు పట్టణం నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరి తిరుపతి మీదుగా ఉదయం 6 గంటలకు విజయవాడకు వెళుతుందని తెలియజేశారు. డిపో మేనేజర్ సుధాకరయ్య ఆధ్వర్యంలో విజయవాడకు ఈ బస్సును ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.